Terrible tragedy:తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

by Jakkula Mamatha |   ( Updated:2024-09-21 10:47:49.0  )
Terrible tragedy:తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ శ్రీకాకుళం లంకపేటలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు గ్రామస్థుల పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలోఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో ఐదుగురిపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి చెందగా.. గాయపడిన పలువురిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి గుర్తించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన చికిత్స కోసం విశాఖ కెజిహెచ్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story