- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్మశానవాటికలో దారుణం.. వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం
దిశ,నల్లగొండ: నల్లగొండలోని హిందూపూర్ నీళ్ల ట్యాంక్ వద్ద ఉన్న శ్మశాన వాటిక వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోర అమానవీయ సంఘటన చోటు చేసుకుంది.ఉదయం నల్లగొండ మున్సిపాలిటీలో పని చేసే స్వీపర్ మహిళ తన విధుల్లో భాగంగా రోడ్లు శుభ్రం చేస్తున్న సమయంలో కృష్ణ అనే యువకుడు మద్యం మత్తులో ఊగుతూ ఆమెతో మాయ మాటలను చెప్పి స్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లి ఒక్కసారిగా ఆమె పై బలవంతం చేసి అత్యాచారం చేశాడు.ఆపై అక్కడి నుండి పరార్ అయ్యాడు.లేవలేని స్థితిలో పడివున్న మహిళ తన కూతురు సహాయంతో వన్ టౌన్ పోలీస్ కు తరలించగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.నిందితుడు కందుల కృష్ణ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.ఇదే విషయమై వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డిని వివరణ అడుగగా ఆమె డ్యూటీ కి వెళ్లే దారిలో కాపు కాచి ఆమెను స్మశానం లోకి లాక్కెళ్లి రేప్ చేసి ఆమె ఈ విషయం ఎవరికి చెప్పిన నిన్ను చంపేస్తానని బెదిరించినట్లు వెంటనే మహిళ ఫిర్యాదు చేయగానే అతడిని పట్టుకుని విచారణ చేసినట్లు అతడి మీద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇలాంటి వారిని ఉరి తీయాలి : నెవర్సు నీరజ,బీజేపీ అధికార ప్రతినిధి
ఈ సంఘటన నల్లగొండ మహిళా లోకం ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తిని వెంటనే ఉరి తీయాలని మహిళలకు ఈ ప్రభుత్వం లో భద్రత కరువు అయ్యిందని మంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన దురదృష్టకరం అని ఆమె దిశ తో తెలిపారు.