డీజిల్ దొంగల హల్చల్..హైవే పై ఆగిన లారీలే టార్గెట్

by Jakkula Mamatha |   ( Updated:2024-08-05 14:43:06.0  )
డీజిల్ దొంగల హల్చల్..హైవే పై ఆగిన లారీలే టార్గెట్
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట:పల్నాడులో ఓ కొత్త రకం ఆయిల్ చోరీ ముఠా హల్చల్ చేస్తోంది. దర్జాగా కారులో చక్కర్లు కొడుతూ డీజిల్ చోరీలకు పాల్పడుతుంది. హైవేల పై ఆగిన లారీలను టార్గెట్ చేసి ఆయిల్ ట్యాంకులను ఖాళీ చేస్తుంది. ఇటీవల నరసరావుపేటలో ఈ ముఠా లారీల నుంచి ఆయిల్ దొంగలిస్తున్న దృశ్యాలు ఓ సీసీ కెమెరాలో రికార్డు కావడం కలకలం రేపింది. నరసరావుపేట పిడుగురాళ్ల సత్తెనపల్లి పల్నాడు జిల్లాలో వ్యాపార కేంద్రాలుగా కోనసాగుతున్నాయి. ఈ ప్రాంతాలకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు ఎగుమతి దిగుమతి చేసేందుకు పెద్ద సంఖ్యలో లారీలు వస్తూ పోతుంటాయి.

ఈ క్రమంలో లారీలకు లోడింగ్-అన్ లోడింగ్ చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఇలా నిలిపిన లారీలను లక్ష్యంగా చేసుకున్న ఆయిల్ చోరీ ముఠా రాత్రి వేళల్లో దర్జాగా కారులో వచ్చి లారీల ట్యాంకుల నుంచి డీజిల్ చోరీలకు పాల్పడుతుంది. అద్దంకి-నార్కెట్ పల్లి - గుంటూరు హైదరాబాద్ హైవేలలో లారీలు ఆపి డ్రైవర్లు అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో ఈ ముఠా డీజిల్ ని దొంగిలిస్తుంది. దీంతో తెల్లవారేసరికి డీజిల్ తగ్గిపోతుండటంతో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. పోలీసులు ఆయిల్ చోరీ ముఠా ఆటపట్టించాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story