వ్యభిచార కేంద్రం పై పోలీసుల దాడి.. పట్టుబడిన బీఎల్ఎఫ్ రాష్ట్ర నేత

by Sumithra |
వ్యభిచార కేంద్రం పై పోలీసుల దాడి.. పట్టుబడిన బీఎల్ఎఫ్ రాష్ట్ర నేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లోని వ్యభిచార కేంద్రం పై మూడో టౌన్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు దండి వెంకటి పట్టుబడ్డారు. ఈ మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు మూడవ టౌన్ ఎస్సై ప్రవీణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కార్మిక సంఘాల నాయకుడి ముసుగులో ఉన్న దండి వెంకటి రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. నిజామాబాద్ కార్మిక లోకం మొత్తానికి షాక్ కు గురయింది.

Next Story

Most Viewed