జానీ మాస్టర్ కేసులో కీలక ట్విస్ట్.. అయేషా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

by karthikeya |   ( Updated:2024-09-21 10:47:26.0  )
జానీ మాస్టర్ కేసులో కీలక ట్విస్ట్.. అయేషా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master Case) అలియాస్ షేక్ జానీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆయన భార్య ఆయేషా (Ayesha)పై కూడా కేసు నమోదు చేసేందుకు నార్సింగ్ పోలీసులు (Narsing Police) సిద్ధమవుతున్నారు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌ (Female Choreographer) ఇంటికి వెళ్లి.. ఆమెపై దాడి చేసిందంటూ ఆయేషాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెపై చర్యలకు సిద్ధం అవుతున్నారట పోలీసులు. ఈ విషయంలో ఆయేషాతో పాటు మరో ఇద్దరిపై వేరుగా కేసు నమోదు చేసి అవసరమైతే అరెస్ట్ (Arrest) చేసేందుకు కూడా రెడీ అవుతున్నారని సమాచారం. మరోవైపు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న జానీ మాస్టర్‌ను విచారణ కోసం 10 రోజుల పాటు తమ కస్టడీ (Custody)కి అప్పగించాలని కోరుతూ నార్సింగ్ పోలీసులు కోర్టు (Court)లో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

Advertisement

Next Story