- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులు.. హైదరాబాద్‌లో MBA విద్యార్థి ఆత్మహత్య!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రయివేట్ ఉమెన్స్ హాస్టల్‌లో ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉలుబాక గ్రామానికి చెందిన సాహితీ అనే యువతి ఉంటోంది. సడన్‌గా గురువారం హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తోటి యువతుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
తాజాగా.. సాహితీ ఆత్మహత్యపై మేనమామ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వెంకటాపురం మండలానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నేత కొడుకు వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపించారు. గతకొంతకాలంగా తనకు ఇష్టమొచ్చినట్లు మెసేజులు చేశాడని.. ఇదే విషయాన్ని సాహితీ సదరు యువకుడి తండ్రికి చెప్పగా.. రివర్స్ తననే తిట్టాడని చెప్పిందన్నారు. ఈ విషయాలతో తీవ్ర మనస్థాపానికి గురైన సాహితీ సూసైడ్ చేసుకున్నదని తెలిపారు. మరోవైపు ఆమె మరణానికి కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు.