తీవ్ర విషాదం.. ఆ తండ్రి ఆత్మహత్యకు కారణం తెలిస్తే కంటనీరు ఖాయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-26 16:57:37.0  )
తీవ్ర విషాదం.. ఆ తండ్రి ఆత్మహత్యకు కారణం తెలిస్తే కంటనీరు ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి బలవన్మరణం పొందారు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story