కిల్లింగ్ లవ్ స్టోరీ : లవ్ అంటూ రమ్మంటుంది.. మాయ చేసి ప్రాణాలు తీస్తోంది!

by Jakkula Mamatha |   ( Updated:2024-02-22 15:57:38.0  )
కిల్లింగ్ లవ్ స్టోరీ : లవ్ అంటూ రమ్మంటుంది.. మాయ చేసి ప్రాణాలు తీస్తోంది!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమ.. ఇది అమ్మాయి, అబ్బాయిలో సమానంగా ఉంటే వారి లైఫ్ బాగుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో నిజమైన ప్రేమ అనేది ఎక్కడా కనిపించడం లేదు. కొంత మంది అమ్మాయిలు, అబ్బాయిలు లవ్ పేరుతో ట్రాప్ చేసి జీవితాలతో ఆడుకుంటున్నారు. లవ్ అంటూ దగ్గరై తర్వాత బ్రేకప్ చెప్పేసి పోతుంటారు. ఇంక కొంత మంది ఒకే సారి ఇద్దరి, ముగ్గురితో ప్రేమాయాణం నడిపిస్తూ.. అందరి జీవితాలతో ఆడుకుంటారు. చివరకు ప్రాణాలు తీస్తున్నారు.

సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ అమ్మాయి ఒకేసారి ఐదుగురితో ప్రేమాయణం నడిపింది. ఐదుగురిని ‘నువ్వే నా ప్రాణం’ అంటూ ఒక్కొక్కరిని వరుసగా పీకల్లోతు ప్రేమలోకి దింపింది. ఒకేసారి అందరితో జర్నీ చేసింది. వారితో సరదా మాటలు, పార్క్‌లు అంటూ తిరగడమే కాకుండా.. నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించింది.. చివరకు మూడు ప్రాణాలు బలిగొంది.

వీరి మరణం తర్వాత అసలు నిజాలు బయటకు వచ్చాయి. సదరు యువతి ప్రేమ కథలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. వీరిద్దరే కాదు తాను ఇంకో ఇద్దరిని కూడా ట్రాప్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వారితో ప్రేమాయణం నడుపుతోందని గుస గుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే పోలీసులు కీలక సూచనలు చేస్తున్నారు. లవ్ పేరుతో ట్రాప్ చేసే అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. లవ్ ఫెయిల్ అయిందని ఆత్మహత్యలు వంటి దారుణాలకు పాల్పడకుండా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed