దత్తత తల్లిదండ్రుల అమానుషం

by Sridhar Babu |   ( Updated:2024-08-13 16:02:52.0  )
దత్తత తల్లిదండ్రుల అమానుషం
X

దిశ, బోధన్ : నిజామాబాద్ జిల్లాలో దత్తత తీసుకున్న 10 సంవత్సరాల వయస్సు గల బాలుడిని ఇంటి పనులు చేపిస్తూ చిత్రహింసలకు గురిచేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకసిపేట్ ఏరియా లో 10 సంవత్సరాల బాలుడిని దత్తత తీసుకున్న బాలుడితో ఇంటి పనులు చేయిస్తూ బాలుడి కాళ్లు, చేతుల పై కొడుతూ చిత్రహింసలకు గురిచేయడంతో బాలుడు పెద్దగా కేకలు వేయడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ వీరయ్య సంఘటన స్థలానికి చేరుకొని తల్లిదండ్రులబారి నుండి పిల్లవాడిని రక్షించి, బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు.

Advertisement

Next Story