చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి

by Rajesh |
చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. సిచ్వాన్ ప్రావిన్స్‌లోని జిగాంగ్ పట్టణంలో షాపింగ్ సెంటర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం మంటలు చెలరేగగా గురువారం ఉదయం 3 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినట్లు తెలిసింది. అగ్ని ప్రమాద విషయం తెలియగానే స్థానిక ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story