Fake food inspectors : నగరంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు..

by Sumithra |   ( Updated:2024-08-10 16:57:57.0  )
Fake food inspectors : నగరంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు..
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ లు తయారు అయ్యారు. హైద్రాబాద్ నుండి వచ్చిన స్పషల్ అధికారుల మంటూ ఖమ్మం నగరంలో కొన్ని రెస్టారెంట్ లలో తనిఖీలు చేపట్టి వారి నుంచి వేలు, లక్షల్లో వసూలు చేస్తున్న గ్యాంగ్ ని ఖమ్మం నగరంలో పట్టుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. తాము ఆహార తనిఖీ అధికారుల మంటూ ఖమ్మంలో హల్చల్ చేసిన ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఖమ్మం నగరంలోని కింగ్ దర్బార్ హోటల్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కిచెన్ రూమ్ లోకి వెళ్లి కుళ్లిపోయిన మాంసం, కాలం చెల్లిన నిత్యావసర సరుకులు వినియోగిస్తున్నారంటూ హోటల్ యజమాని పై ఫైర్ అయ్యారు.

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని మండిపడుతూ ఒక దశలో హోటల్ యజమానిని మీ హోటల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని హైదరాబాద్ నుంచి తమను ఆకస్మిక విచారణ చేయమని తమకు ఆదేశాలు ఉన్నాయని బెదిరించారు. మరి రెస్టారెంట్ నిర్వాహకులను భయబ్రాంతులకు గురి చేసి వీడియోలు తీసినం అని చెప్పిన కేటుగాళ్లన్నారు. అరెస్టయిన నిందితులు గతంలోనూ ఇలాంటి దాడులకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన నిందితులు భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ రావ్, బానోత్ రామస్వామి, సపావత్ యువరాజ్, అజ్మీరా యువరాజ్ సింగ్ గా గుర్తించిన పోలీసులు.

Advertisement

Next Story

Most Viewed