- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మద్యం తాగి వేధిస్తున్నాడని తండ్రి ఏం చేశాడో తెలుసా....
దిశ, శంషాబాద్ : నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడని కన్న కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండపల్లి ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన దూలప్ప రెడ్డి, అతని భార్య సరస్వతి తోపాటు అతని కుటుంబ సభ్యులతో కలిసి 35 సంవత్సరాల క్రితం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉంటూ లేబర్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెండవ కుమారుడు శివ కుమార్ రెడ్డి (36) గతంలో డ్రైవింగ్ పనిచేసి, ఇప్పుడు గైడ్ గా పని చేస్తున్నాడు.
మృతుడు శివకుమార్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిని కోరడంతో తాను ఇవ్వనని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత కొద్ది సేపటికి ఇంట్లో పెద్ద అరుపులు శబ్దం రావడంతో వెళ్లి చూడగా అప్పటికే మృతుడు శివకుమార్ రెడ్డి రక్తపు మడుగులో మంచం పై పడి ఉన్నాడు. మృతుడి తండ్రి చేతిలో కత్తి ఉందని, అప్పటికే మృతుడు శివకుమార్ మృతి చెంది ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆప్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- murder