- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం...విద్యార్థి దారుణ హత్య
దిశ, బడంగ్పేట్ : సంచలనం సృష్టించిన రౌడీషీటర్ రియాజ్ హత్య కేసు మరవకముందే బీఈ సివిల్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం తీవ్ర కలకలం రేపింది. మంది @ 37 అరేబియన్ బిర్యాని సెంటర్ గేట్ ఆవరణలో ఉన్న పాన్ షాప్‌లో సిగరెట్ తాగడానికి వెంట వచ్చిన ముగ్గురిలో ఒకరు కత్తితో బీఈ సివిల్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యాడు. బాలాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... బాలాపూర్ గణేష్ చౌక్ వద్ద మంది @ 37 అరేబియన్ బిర్యాని సెంటర్ గేట్ ఆవరణలోని ఓ పాన్ షాప్‌కి గురువారం సాయంత్రం నలుగురు స్నేహితులు సిగరెట్ కోసం వచ్చారు.
అక్కడ సిగరెట్లు కొనుగోలు చేశారు. సిగరెట్ తాగుతుండగా 21 సంవత్సరాల యువకుడికి వెంట వచ్చిన మరో ముగ్గురిలో ఒకరితో గొడవ జరిగింది. వెంటనే కత్తితో సదరు యువకుడిని అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా హత్య చేశాడు. అతను మృతి చెందగానే మరో ముగ్గురు స్నేహితులు అక్కడి నుంచి ఓ బైక్ పై పరారయ్యారు. అరేబియన్ బిర్యాని సెంటర్ నిర్వాహకుల ద్వారా సమాచారం అందుకున్న మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యానారాయణ, ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి బృందం వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుని కాలేజీ బ్యాగ్ లో లభించిన హాల్ టికెట్, ఓటర్ కార్డు ఆధారంగా మృతుడు ఖమ్మం జిల్లా అయ్యవారి గూడెం ప్రాంతానికి చెందిన
టి.అనిత, మోండ్రు శాంతయ్యల కుమారుడు మోండ్రు ప్రశాంత్ (21)గా పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన ప్రశాంత్, అతని తల్లి అనితతో కలిసి గత కొంత కాలంగా బాలాపూర్‌లో నివాసముంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేగాకుండా ప్రశాంత్ నాదర్గూల్లోని ఎంవీఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ సివిల్స్ ద్వితీయ సంవత్సరం చదివేవాడు. అతని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంతకు ప్రశాంత్ వెంట వచ్చిన ఆ ముగ్గురు స్నేహితులేనా ? కాదా? వారి మధ్య పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- murder