Minor Girl : మైనర్ బాలిక పై లైంగిక దాడికి యత్నించిన ప్రజా ప్రతినిధి..

by Sumithra |   ( Updated:2024-08-06 11:33:09.0  )
Minor Girl : మైనర్ బాలిక పై లైంగిక దాడికి యత్నించిన ప్రజా ప్రతినిధి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి గలీజ్ పనికి తెగబడ్డాడు. తన స్థాయిని మరిచి నీచానికి దిగజారాడు. ఓ మైనర్ బాలిక పట్ల అసహ్యంగా ప్రవర్తించాడు. అభ్యంతరకర రీతిలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. స్థానికులు గమనించి మైనర్ బాలికను రక్షించారు. నిందితునికి తమదైన రీతిలో బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాల్లోకెళితే బోధన్ మున్సిపల్ పరిధిలోని ఓ వార్డుకు చెందిన కౌన్సిలర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

మెడిసిన్ కోసం వెళ్లిన మైనర్ బాలిక ఆటోలో ప్రయాణిస్తుండగా చూసిన సదరు కౌన్సిలర్ ఆటో ఆపి తను కూడా అటే వెళ్తున్నానని చెప్పి బాలికను కారులో ఎక్కించుకున్నాడు. కారును తీసుకెళ్లాల్సిన మార్గంలో తీసుకెళ్లకుండా మంగళ్ పహాడ్ వైపు మళ్ళించి కారును ఓ చోట పార్కు చేశాడు. కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బాలిక భయంతో అభ్యంతరం తెలుపుతూ అసహనానికి గురవుతున్నట్లు స్థానికులు గమనించారు. దీంతో కారు వద్దకెళ్లి విషయం తెలుసుకొని సదరు నిందితుడిని నిలదీసి పోలీసులకు అప్పగించారు. నిందితుడి పై పోలీసులు ఫోక్సో కేసును నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిసింది.

Advertisement

Next Story