మహిళా ఎస్ఐ రాసలీలలు.. కానిస్టేబులైన భర్త కంట పడటంతో..

by sudharani |   ( Updated:2022-12-26 13:16:28.0  )
మహిళా ఎస్ఐ రాసలీలలు.. కానిస్టేబులైన భర్త కంట పడటంతో..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ ఇబ్బందులు లేకుండా సాగుతున్న సంసార జీవితంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న వారినే కడ తేర్చుతున్నారు. ఇటీవల జరిగన ఇలాంటి ఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పోలీస్ భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు విషయం తెలియడంతో అతడిని అడ్డు తొలిగించుకునే క్రమంలో హత్య చేయించింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే..

కృష్ణగిరి జిల్లా కల్లాలి ప్రాంతానికి చెందిన చిత్ర, సెంథిల్(48) భార్యాభర్తలు. భర్త సెంథిల్ వృత్తిరిత్యా కానిస్టేబుల్.. భార్య ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో మంచి ఉద్యోగాలు.. గౌరవప్రదమైనా జీవితం.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వీరి కాపురం చక్కగా సాగుతుంది అనుకున్న క్రమంలో భార్య బుద్ధి వంకర మార్గంలో వెళ్లింది. భార్త ఉండగానే వేరే మగాళ్లతో సన్నిహితంగా మెలిగేది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంత కాలం పాటు బాగానే సాగిన వీరి చీకటి సంబంధం ఓ రోజు భర్త కంట పడింది.

దీంతో భార్యను బుద్ధి మార్చుకోమంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు సెంథిల్. భర్త కోపానికి భయపడిన భార్య అతడిని ఎలాగైన అడ్డు తొలగించుకుని ప్రియుడితో ఎంజాయ్ చేయాలి అనుకుంది. అనుకున్న విధంగానే భర్తను చంపేందుకు సుఫారీ గ్యాంగ్‌ను మాట్లాడి పని ముగించింది. ఆ తర్వాత భర్త కనిపించడంలేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొదట అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు భార్య కాల్ లిస్ట్ కూడా చెక్ చేశారు. దీంతో ఆమెపై అనుమానంతో భార్యను విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది. కాగా.. పోలీసులు చిత్రతో పాటు ఆమెకు సాయం చేసిన మరుకొందరిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి : శృంగార ఆఫర్.. ఏ అమ్మాయితోనైనా రూ.1000లకే సెక్స్.. మెయిన్ రోడ్డుపై బోర్డు ఏర్పాటు (వీడియో)

Advertisement

Next Story