Vaishali Kidnapping Case: వైశాలి కిడ్నాప్ కేసు: దొరికిన నవీన్ రెడ్డి కారు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-13 07:29:17.0  )
Vaishali Kidnapping Case: వైశాలి కిడ్నాప్ కేసు: దొరికిన నవీన్ రెడ్డి కారు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ రెడ్డి కారు దొరికింది. వైశాలి కిడ్నాప్ సమయంలో నవీన్ రెడ్డి నల్ల రంగు వోల్వో కారు వాడాడు. కారును గుర్తించి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. కారులో పారిపోతే దొరికిపోతామని తొండపల్లి వద్ద కారును వదిలేసి వెళ్లినట్లు తెలిసింది. రెండు రోజులుగా కారు శంషాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆన్‌లో ఉంచి నవీన్ రెడ్డి పారిపోయాడు. కాగా కారు డోర్స్ తెరుచుకోవడం లేదు. పోలీసులు కారును ఆదిబట్ల పీఎస్ కు తరలించారు. కారు డోరు తెరిచేందుకు టెక్నిషియన్ ను పిలిపించారు. కారు డోరు తెరుచుకుంటే కీలక ఆధారాలు దొరుకుతాయని పోలీసులు భావిస్తున్నారు.

నవీన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నవీన్ రెడ్డి, రుమాన్, సిద్ధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నవీన్ రెడ్డి ఓయో హోటల్ లో బస చేసి విజయవాడకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు నవీన్ రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన విషయం తెలిసిందే.

Read More....

స్పా ముసుగులో వ్యభిచారం.. పట్టుబడ్డ 8 మంది యువతులు

Advertisement

Next Story

Most Viewed