గుర్తుతెలియని మహిళ శవం లభ్యం..

by Kalyani |
గుర్తుతెలియని మహిళ శవం లభ్యం..
X

దిశ, హత్నూర : గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు శవాన్ని తగలబెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జిన్నారం సీఐ నయీముద్దీన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నస్తీపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ శవాన్ని దుండగులు తగలబెట్టారు. శవం వయసు సుమారు 25-35 సంవత్సరాలు ఉంటుందని సిఐ తెలిపారు. శవం పై ఆకుపచ్చ చీర కాలిన ముక్కు, రెండు కాళ్లకు వెండి కడియాలు, చేతికి గాజులు చెవులకు ముట్టిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిన్నారం సీఐ నయీముద్దీన్..

నస్తీపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని శవాన్ని జిన్నారం సీఐ నయీముద్దీన్ పరిశీలించారు, సంగారెడ్డి క్లూస్ టీం, జాగిలాలు రప్పించామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎవరైనా ఆమెను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story