- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
దిశ,మామడ : వరకట్న వేధింపులకు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మామడ మండలంలో చోటుచేసుకుంది .మండలంలోని న్యూ లింగంపల్లి గ్రామానికి చెందిన దేవరశెట్టి వికాసిని(24) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది .పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన వికాసిని న్యూ లింగంపల్లి గ్రామానికి చెందిన నవీన్ తో 2019లో సంవత్సరంలో వివాహం చేయగా రూ. 3లక్షలు, రెండు తులాల బంగారాన్ని వరకట్నంగా ఇచ్చారు. కొద్ది రోజులు సంసారం సాఫీగా సాగింది.కొన్ని రోజుల నుంచి నవీన్ తన భార్యను అదనపు కట్నం రూ. 50,000 తీసుకురావాలని తరచుగా మానసికంగా,శారీరకంగా వేధించాడు .దీంతో కుటుంబ సభ్యులు అనేకమార్లు సర్ది చెప్పినా వినలేదు. వేధింపులు ఆగకపోవడంతో మానసికంగా అనేకసార్లు కృంగిపోయి ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది . ఈ సంఘటన స్థలాన్ని డీఎస్పీ గంగారెడ్డి, తాసిల్దార్ సుధాకర్, సీఐ నవీన్ కుమార్ లు పరిశీలించారు. వికాసినికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ పేర్కొన్నారు.