వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

by Shiva |
వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
X

దిశ, చేగుంట : కుటుంబ కలహాలతో పాటు భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మాసాయిపేట మండల పరిధిలోని రామంతాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన మన్నె సుశీల, మల్లేషం కుమార్తె సుజాత(30)ను 14 ఏళ్ల క్రితం రామంతాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ తో వివాహం జరిపించారు.

వీళ్లకు 11 ఏళ్ల అబ్బాయి సాత్విక్, 9 ఏళ్ల అబ్బాయి వరుణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన నాటి నుంచి భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కుటుంబ కలహాలు, భర్త వేధింపులకు భరించలేక శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు చేగుంట పోలీసులకు సమాచారం అందజేశారు.

కుమార్తె మృతి చెందిన విషయం తెలుసుకున్న సుజాత తల్లిదండ్రులు తూప్రాన్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన మన్నే సుశీల, మన్నె మల్లేశం ఇతర కుటుంబ సభ్యులు గ్రామస్థులు తరలివచ్చి చేగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల వల్లే సుజాత ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి తల్లి సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story