రైలు పట్టాలపై కూర్చుని ఇలాంటివి చేస్తే.. చావే గతి మరి

by Rani Yarlagadda |   ( Updated:2024-10-23 06:25:14.0  )
రైలు పట్టాలపై కూర్చుని ఇలాంటివి చేస్తే.. చావే గతి మరి
X

దిశ, వెబ్ డెస్క్: రైలు ఢీ కొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఇదేదో ప్రమాద వశాత్తు జరిగిందనుకోకండి. వాళ్లు కోరి తెచ్చుకున్న ప్రమాదం. ఆత్మహత్య చేసుకోవాలని వెళ్లారా అంటే.. అది కూడా కాదు. ఎక్కడా ఖాళీ లేనట్లు.. తీరిగ్గా రైలు పట్టాలపై కూర్చుని మద్యం తాగారు. అంతలోనే రైలు వచ్చి ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మరణించారు. వీరిలో ఒక మైనర్.

బుధవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘటనపై కదిరి రైల్వే ఎస్ఐ రహీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరుకు చెందిన శ్రీనివాసులు కొడుకు కిరణ్ కుమార్ (19), అతని ఫ్రెండ్ యాసిన్ (17) పులిచెర్ల రోడ్డులో రైలు పట్టాలపై కూర్చుని మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో అటువైపు వెళ్లిన నాగర్ కోయల్ ఎక్స్ ప్రెస్ (Nagercoil Express) వీరిని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed