ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

by Sridhar Babu |   ( Updated:2024-12-24 14:40:08.0  )
ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
X

దిశ, శంకరపట్నం : ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. కానీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. వివరాల్లోకి వెళితే..... శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో జాతీయ రహదారి పైన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి .వరంగల్ ఒకటవ డిపోకు చెందిన బస్సు హనుమకొండ వైపు వెళ్తుండగా, బోధన్ డిపో కు చెందిన బస్సు కరీంనగర్ వైపు వస్తుంది. ఇవి తాడికల్ జాతీయ రహదారి పైన ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హనుమకొండ వైపు వెళ్లే బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యవసాయ బావి దగ్గర ఆగిపోయింది. దీంతో ఆ బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికులకు రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది. మరో బస్సులో 37 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. బోధన్ డిపోకు చెందిన బస్ డ్రైవర్ రాఘవేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed