జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం.. ఎద్దుల దాడిలో ఇద్దరు స్పాట్ డెడ్

by Satheesh |   ( Updated:2023-04-27 11:09:47.0  )
జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం.. ఎద్దుల దాడిలో ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో నిర్వహిస్తోన్న జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. గురువారం శివగంగై జిల్లాలో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. పోటీల సమయంలో ఎద్దులు జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన ప్రజలపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోటీ నిర్వాహకులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed