- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లెపాడులో తీవ్ర విషాదం.. నదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి..
దిశ, మానవపాడు: నానమ్మను పలకరించేందుకు వెళ్తామని నదిలోకి ఈతకు వెళ్లి అనంతలోకాలకు వెళ్లిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామ శివారులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఇబ్రహీం, ఇస్మాయిల్ ఇద్దరు అన్నదమ్ములకు ఆరుగురు సంతానం. అందులో సమీర్ (8), రెహాన్ (15) ఇబ్రహీం కుమారులు. ఆఫ్రిన్ (17) నౌషిన్ (8) ఇస్మాయిల్ కూతుళ్లు. వీరందరూ కుటుంబ సమేతంగా వారం రోజుల క్రితం తన సొంత మేనత్త సలీమా గ్రామమైన బోరవెల్లికి హాలిడేస్ నిమిత్తం కుటుంబ సమేతంగా వచ్చారు. వారం రోజుల నుంచి ఇంటి దగ్గరే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా గడిపారు.
తన బావ వరుస అయిన ఇమామ్ తో కలిసి ఆటోలో వల్లూరు గ్రామంలో ఉన్న నానమ్మను పలకరిస్తామని 11 మంది కలిసి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లకుండా పల్లెపాడు గ్రామ సమీపంలో ఉన్న కృష్ణా నదిలోకి సరదాగా గడపాలని, ఈత కొట్టాలని అక్కడికి వెళ్లారు. సమీర్ , రెహాన్, ఆఫ్రిన్, నౌషిన్ ఈత కొట్టాలని ముందుగా నదిలోకి దిగారు. నదిలోతు తెలువకపోవడంతో ఒక్కసారిగా మునగడంతో రక్షించాలని ఇమామ్ నదిలోకి ఒక్కసారిగా దూకాడు. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. నలుగురు నీటిలో ఒక్కసారిగా మునిగిపోయి మృత్యువాత పడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన ఆఫ్రిన్ ను తన బావ వరుస అయినా ఇమామ్ కు నిశ్చితార్థం చేయాలని అనుకున్నారు, అంతలోనే ఈ విషాదం నెలకొంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాచాయలు నెలకొన్నాయి. ఇబ్రహీం కుటుంబం, ఇస్మాయిల్ కుటుంబం గత కొన్ని రోజులుగా కర్నూల్ లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవుల నిమిత్తం సరదాగా గడపాలని బోరవెల్లి గ్రామానికి వచ్చారు. అంతలోనే ఈ విషాదం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.