విషాదం..మరో నేత కార్మికుడి ఆత్మహత్య

by Aamani |
విషాదం..మరో నేత కార్మికుడి ఆత్మహత్య
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో నేత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణంలోని 22వ వార్డు గణేష్ నగర్ కి చెందిన ఎర్రం కొమురయ్య (55) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. గత 8 నెలల నుండి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వలన మంగళవారం అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్ష్మి ఉన్నారు. కాగా సిరిసిల్లలో నేతన్నల వరస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పట్టణంలోని వెంకంపేటలో నేత కుటుంబానికి చెందిన అమర్-స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకోగా, నాలుగు రోజులు గడవక ముందే మరో నేత కార్మికుడు కొమురయ్య ఆత్మహత్య చేసుకోవడంతో సిరిసిల్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed