- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిస్మస్ పండుగ వేడుకలో విషాదం..రసాయనిక పదార్థం పడి యువకుడికి గాయాలు
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకలకు సిద్ధమైన ఓ ఇంట్లో అనుకోని ప్రమాదం యువకుడికి గాయాలు చేసిన ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇల్లును శుభ్రం చేసే క్రమంలో ఇంట్లో ఉన్న చెత్తాచెదారాన్ని తీసివేస్తుండగా ఇంట్లో ఉన్న హ్యాండ్ శానిటైజర్ (రసాయనిక పదార్థం) డబ్బాను బయటికి పారవేయడం తో ప్రమాదవశాత్తు డబ్బా పేలి అందులో ఉన్న రసాయన పదార్థం మోనాపురం రాజు అనే చిన్నారిపై పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. తల శరీర భాగాల్లో గాయాలయ్యాయి. శానిటైజర్ డబ్బా పేలడంతో పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు చిన్నారిని వైద్య చికిత్స కోసం మద్దూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.