హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

by Javid Pasha |
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కుషాయిగూడ పరిధిలోని సాయి నగర్ కాలనీ ప్రధాన రోడ్డు సమీపంలో ఉన్న ఓ టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారని సమాచారం. వీరంతా వరంగల్ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. టింబర్ డిపోలోని చెక్కలకు మంటలు అంటుకుని తగలబడటంతో స్థానికులు అదుపుచేయలేకపోయారు. క్రమంగా అవి అక్కడే ఉన్న దుంగలు, కట్టెలకు మొత్తానికి విస్తరించినట్లు స్థానికులు తెలిపారు. దీంతోపాటు డిపో పక్కన ఉన్న భవనంలోని రెండో అంతస్తులోకి మంటలు వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న భార్యాభర్తలు, 8 యేండ్ల బాలుడు సజీవ దహనం అయ్యారు.

భారీ ప్రమాదం సంభవించిందని సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలను అదుపుచేయడాని ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుుకున్నాయి.

Advertisement

Next Story