అందమైన కుటుంబం.. విహారయాత్రతో మిగిలిన విషాదం

by sudharani |   ( Updated:2022-12-11 09:50:48.0  )
అందమైన కుటుంబం.. విహారయాత్రతో మిగిలిన విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: అందమైన కుటుంబంలో అనుకోకుండా విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో ఎంతో అందంగా బతుకుతున్న వారి కుటుంబాన్ని విధి చిన్న చూపు చూసింది. పిల్లలను తీసుకుని సరదాగా వెళ్లిన విహారయాత్ర వారి ప్రాణాలను తీసింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఉరవకొండ పరిధిలోని ముష్టూరుకు చెందిన శ్రీకాంత్ (36), ప్రతీక్ష (35) దంపతులు. వీరికి ఓ కుమార్తె.. కుమారుడు ఉన్నాడు. ఉద్యోగాలతో బిజీగా.. పిల్లలతో సరదాగా.. ఎలాంటి మనస్పర్థలు లేకుండా వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగుతూ ఉండేది. వారమంతా ఆఫీసుల్లో బిజీగా ఉండే వీరు ఓ రోజు విహారయాత్రకు కర్ణాటకకు వెళ్లాలనుకున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఈ దంపతులు కారులో తమ పిల్లలతో సహా విహారయాత్రకు బయలుదేరారు.

ముందుగా బెంగుళూరు చేరుకుని అక్కడ మంజునాథ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శృంగేరికీ బయలుదేరారు. ఇక ఉడిపి జిల్లాలో వీరు ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేట్ బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న దంపతులతో సహా వీరి కుమార్తె కూడా మరణించింది. కుమారుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గాయపడ్డ కుమారుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


Also Read.....

దారుణం... వేగంగా వెళ్తున్న కారులోంచి పసికందును బయటకు విసిరేసిన తోటి ప్రయాణికులు

Advertisement

Next Story

Most Viewed