ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లకు గాయాలు

by Sridhar Babu |
ఐఈడీ పేలి ముగ్గురు జవాన్లకు గాయాలు
X

దిశ, భద్రాచలం : చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్కా గ్రామ సమీపంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. శుక్రవారం డీఆర్జీ బృందం మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్ కు వెళ్లింది. ఈ సమయంలో భద్రతా బలాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ఐఈడీ మందుపాతరపై జవాన్ అడుగు వేయడంతో ప్రెషర్ బాంబు ఒక్కసారిగా పేలింది. దీంతో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయు. గాయపడ్డ జవాన్ లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story