బైక్ పై వచ్చారు...డబ్బుల సంచి లాక్కెళ్లారు...

by Sridhar Babu |
బైక్ పై వచ్చారు...డబ్బుల సంచి లాక్కెళ్లారు...
X

దిశ, నాగిరెడ్డిపేట్ : బ్యాంకు నుంచి వ్యక్తి డబ్బులు విత్ డ్రా చేస్తుండగా గమనించిన దుండగులు బైక్ పై వచ్చి చేతిలో నుంచి డబ్బుల సంచిని లాక్కెళ్లిపోయిన సంఘటన మండలంలోని అక్కంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన జక్కుల రాములు అనే వ్యక్తి మంగళవారం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ లో 85 వేల రూపాయలు విత్ డ్రా చేసుకొని డబ్బుల కవర్ను చేతిలో పట్టుకొని ఆటోలో సొంత స్వగ్రామానికి చేరుకున్నాడు.

కొంత దూరంలో ఆటో దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక వైపు నుండి బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు రాములు చేతిలోని డబ్బుల సంచిని లాక్కొని పరారయ్యారు. దాంతో మరో బైక్​పై దుండగులను వెంబడించినా ఫలితం లేకపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed