theft : లోయర్ మానేరు డ్యామ్ లో వలలు చోరీ

by Sridhar Babu |
theft : లోయర్  మానేరు డ్యామ్ లో వలలు చోరీ
X

దిశ, గన్నేరువరం : లోయర్ మానేరు డ్యాం జలాశయంలో దొంగలు పడ్డారు. మానేరు జలాలను నమ్ముకొని చేపలు పట్టే జాలర్ల వలలు మాయం అయ్యాయి. సుమారు రూ.ఆరు లక్షల విలువ గల వలలు సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. గత నెల రోజుల్లో ఐదు సార్లు ఇలా చోరీ చేశారని జాలర్లు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.

తక్షణం దొంగలను గుర్తించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. గునుకుల కొండాపూర్ లో ట్రాక్టర్ బ్యాటరీల దొంగతనం జరిగిన మరుసటిరోజే చేపల వలలు చోరీ కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల వలల దొంగలను తక్షణమే పట్టుకోవాలని ముదిరాజ్ సంఘం నాయకులు పోలీసులను కోరారు.

Next Story

Most Viewed