సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఈ సారి కూడా పనిమనిషే.. !

by karthikeya |
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఈ సారి కూడా పనిమనిషే.. !
X

దిశ, బడంగ్‌పేట్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ. 10 లక్షలు దొంగతనం జరిగిన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పహాడి షరీఫ్ ఇన్ స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి మంచు టౌన్‌షిప్‌లో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు ఇల్లు ఉంది. గత 12 ఏళ్లుగా అందులో మోహన్ బాబు దంపతులతో పాటు అతని కుమారులు, కోడళ్ళు నివశిస్తున్నారు. అదే ఇంట్లో కిరణ్ తేజ్, గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పని చేస్తున్నారు. సోమవారం తిరుపతిలోని మోహన్‌బాబుకు సంబంధించిన మరో ఇంటి నుంచి కిరణ్ తేజ్, గణేష్‌లు జల్‌పల్లిలోని ఇంటికి రూ.10 లక్షలు నగదు తీసుకువచ్చారు. ఆ తర్వాత కిరణ్ తేజ్ పడుకోవడానికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత రూ.10 లక్షలతో పాటు గణేష్ కనిపించక పోవడంతో కిరణ్ తేజ్ యజమాని మోహన్‌బాబుకు వివరించారు. అనంతరం మోహన్ బాబు సలహా మేరకు కిరణ్ తేజ్ సోమవారం రాత్రి పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసును నమోదు చేసుకున్న పహాడి షరీఫ్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మోహన్ బాబు ఇంట్లో ఇంతకుముందు కూడా చోరీ జరిగింది. 2019లో ఇదే తరహాలో తన ఫిల్మ్ నగర్‌లోని ఇంట్లో పని చేసే పనిమనిషి డబ్బులు, నగలు దొంగిలిచిందంటూ మోహన్ బాబు కుటుంబం బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.

Next Story

Most Viewed