లేడీ ఐఏఎస్ ఆఫీసర్ నివాసంలో ఈడీ సోదాలు

by Javid Pasha |
లేడీ ఐఏఎస్ ఆఫీసర్ నివాసంలో ఈడీ సోదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిని పూజా సింఘాల్ నివాసంలో భారీ ఎత్తున నగదు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. క్యాప్టివ్ బొగ్గు వినియోగం కేసులో అవకతవకలను పరిశోధించడానికి శుక్రవారం పూజా సింఘాల్ నివాసంతో పాటు జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జెఎస్‌ఎమ్‌డిసి) మాజీ బొగ్గు మరియు ఇసుక ఇన్‌చార్జి అశోక్ కుమార్ సింగ్‌పై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో పూజా సింఘాల్ నివాసంలో రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. పూజా సింఘాల్ పై గతంలో ఉపాధి హామీ నిధులు కొల్లగొట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో గతేడాది ఆమెతో చార్టెడ్ అకౌంట్ తో పాటు సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు జరపగా ఈ సోదాల్లో రూ.19.31 కోట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ డబ్బులు మినీ ట్రక్కు నిండా పట్టేంత ఉండటంతో అప్పట్లో ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా పూజా సింఘాల్ నివాసంలో జరిపిన దాడుల్లో రూ.3 కోట్ల నగదును ఈడీ సీజ్ చేయడం చర్చగా మారింది.


Advertisement

Next Story

Most Viewed