బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్.. ఇద్దరు స్పాట్ డెడ్

by Sathputhe Rajesh |
బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వేగంగా వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story