తెలంగాణలో శ్రద్ధా తరహా ఘటన.. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు!

by Satheesh |
తెలంగాణలో శ్రద్ధా తరహా ఘటన.. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన హైదరాబాద్ మలక్ పేటలో లభ్యమైన మొండెం లేని తల లభ్యమైన కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తల ఓ నర్సుదిగా పోలీసులు గుర్తించారు. మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద గత వారం ఓ నల్లటి కవర్‌లో చుట్టి పారేసిన మొండెం లేని తల లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోలీసులు మృతురాలు ఎర్ర అనురాధగా గుర్తించారు.

హంతకుడిని సైతం అదుపులోకి తీసుకోగా నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టగా తలను మాత్రం మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చినట్లు సమాచారం. మృతురాలి మొండెంను సోదరి, బావ గుర్తించడంతో ఆ తల నర్సుగా పని చేస్తున్న అనురాధదే అని ధృవీకరించారు. మృతురాలు వడ్డీ వ్యాపారం కూడా నిర్వహించేదని ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యకు కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed