కనిపించకుండా పోయింది..శవమై దొరికింది..

by Sumithra |
కనిపించకుండా పోయింది..శవమై దొరికింది..
X

దిశ, గరిడేపల్లి : మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వృద్దురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ముత్తినేని సక్కుబాయమ్మ (72) గ్రామంలో గురువారం జరిగిన మైసమ్మ, అంకమ్మ, పోలేరమ్మ, కనకదుర్గమ్మ, పోతురాజు మొదలైన దేవతల గుళ్ళు ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని, అదేరోజు కనిపించకుండా పోయింది. సక్కుబాయమ్మ కొరకు ఆమె ముగ్గురు కొడుకులు వెంకన్న, సైదులు, అరవింద్ లు గ్రామంలోని వ్యవసాయ బావులు చెరువులు, కుంటలు చుట్టూ, బంధువుల గ్రామాలలో వెతికినా కానీ ఫలితం లేకపోయింది.

మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన సక్కుబాయమ్మ ఆదివారం కోదండరామ పురం - ఎల్బీనగర్ రహదారిలో ఉన్న నల్ల ఏనే శవమై కనిపించింది. మొదట ఒంటిపై బంగారు ఆభరణాలు లేవని భావించినప్పటికీ, బంగారు నగలు ఒంటిపైనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆమె సహజంగానే ఎండల తీవ్రత వలన చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సక్కుబాయమ్మకు ఇటీవల మతిస్థిమితం లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు, గ్రామ సర్పంచ్ బొలిశెట్టి సుధీర్ బాబు, గరిడేపల్లి పోలీసులు ఎస్సై వెంకటరెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ లభ్యమయిన శవాన్ని ట్రాక్టర్ ద్వారా హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి పంచనామా కోసం పంపించారు.

Advertisement

Next Story