- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లంచం డిమాండ్ చేసిన అధికారికి నాలుగేళ్లు జైలు
దిశ, కరీంనగర్ లీగల్ : లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు పట్టుబడిన అధికారికి కరీంనగర్ జిల్లా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 8 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు అదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం ముత్యంపెల్లి గ్రామానికి చెందిన ఐలి సురేందర్ గ్రామంలో ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తుండగా షాపు నిర్వహణకు ఇబ్బంది కలిగించకుండా ఉండడంతో పాటు ఆఫీషియల్ గా ఫేవర్ చేయడానికి డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ తొగరి పోచయ్య రూ. 4 వేలు డిమాండ్ చేయగా సురేందర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
కాగా 2013 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన బాధితుడు సురేందర్ పోచయ్య కు లంచం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టులో చార్జి షీటు దాఖలు చేయగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ కుమార్ సాక్షులను విచారించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి నిందితుడు పోచయ్య నేరం చేసినట్లు రుజువు కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 8 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.