- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడుపుతో ఉన్న కన్న కూతురిపై తండ్రి దారుణం!!
దిశ, వెబ్‌డెస్క్: సాంకేతికంగా సమాజం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని విషయాల్లో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు. ఇంకా కులం, మతం అంటూ కొందరు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కన్న కూతురు, కొడుకు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరువు హత్యలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనపై ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోకపోవడం మూలంగానే దారుణాలు పెరిగిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన నగ్మా అనే యువతి, అదే గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడు ప్రేమించుకున్నారు.
వీరి ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో యువకుడు తక్కువ కులం వాడని తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. కలిసి బతకాలని ఫిక్సైన యువతీయువకుడు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల పాటు కన్నవాళ్లకు దూరంగా ఉండి.. యువతి గర్భవతి కావడంతో ఇటీవలే సొంత గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి.. జరిగిందేదో జరిగింది అంటూ వారికి మాయమాటలు చెప్పి కలిసిపోయే ప్రయత్నం చేశాడు. ఇటీవల యువతీయువకుడు మెడికల్ చెకప్ కోసం వెళ్లగా.. నరేంద్రను ఆటోతో తొక్కించి చంపడానికి నగ్మ తండ్రి ప్రయత్నించాడు. ఇది గమనించిన నగ్మ కడుపు చేత్తో పట్టుకొని రోడ్లపైన పరిగెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది. అనంతరం యువతిపైనా తండ్రి దాడికి పాల్పడగా.. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రొటెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
ఈ రోజు మళ్లీ పెరిగిన కరోనా కేసులు..
వీడు తండ్రేనా.. ఆ సమయంలో కూతురిపై అత్యాచారం.. విస్తుపోయే విషయాలు చెప్పిన బాలిక