- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బలమైన గాయాలతో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
దిశ, కూకట్పల్లి: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తరమ్మ కాలనీ సమీపంలో తలకు బలమైన గాయాలు, రక్తపు మరకలతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. బాలానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలానగర్ కూడలిలోని ప్లాట్ నెంబర్ 47లో ఉన్న ప్రభాకర్ రెడ్డి కాంప్లెక్స్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న కొడిచర్ల మహేందర్ అనే వ్యక్తి తాను పని చేస్తున్న కాంప్లెక్స్‌కు పక్కనే ఖాళీగా ఉన్న ప్లాట్ నంబర్ 48లోని వేప చెట్టు కింద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం రక్తపు మరకలతో పడి ఉండటాన్ని గమనించి బాలానగర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి ఒంటిపై ఓ చేతిపై మామ్ డాడ్ అని టాటూ ఉంది. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.