అలా చేయొద్దని చెప్పినా వినడం లేదని తల్లిని చంపి బాడిని సూట్‌కేసులో కుక్కిన కూతురు

by Hamsa |   ( Updated:2023-06-13 06:58:15.0  )
అలా చేయొద్దని చెప్పినా వినడం లేదని తల్లిని చంపి బాడిని సూట్‌కేసులో కుక్కిన కూతురు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. వారి మాట వినలేదని కొంత మంది ఇతరులపై కోపాన్ని తెచ్చుకుని దారుణానికి ఒడిగడుతున్నారు. తల్లిదండ్రులు, కన్న కూతురు అని కూడా చూడకుండా ఏదో ఒక కారణంతో ఘోరంగా హత్య చేస్తున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. తన అత్తతో గొడవ పడొద్దని తల్లికి ఎంత చెప్పినా వినడం లేదని కూతురు ఆమెను హత్య చేసింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని లేఅవుట్‌కు చెందిన సోనాలి తన అత్త తల్లితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. నిత్యం కూతురి అత్తతో తల్లి గొడవ పడుతుంది. అది చూసిన కూతురు తల్లికి అలా చెయొద్దని ఎన్ని సార్లు చెప్పినా పదే పదే గొడవ పడుతూనే ఉండేది. అంతేకాకుండా హెచ్చరించినందుకు నిద్రమాత్రలు మింగుతానని బెదిరించింది. దీంతో ఆమె ప్రవర్తనకు విసిగిపోయిన కూతురు ఆమెను చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చేసిన తప్పును ఒప్పుకుని లొంగిపోయింది.

Read more: ఓ జంట బాత్రూంలో కలిసి స్నానం చేస్తూ చనిపోయారు.. అసలేం జరిగిందంటే

Advertisement

Next Story

Most Viewed