- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెలివరీ అయిన కొద్ది సేపటికే బాలింత మృతి
దిశ, మక్తల్ : డెలివరీ అయిన కొద్ది సేపటికే బాలింత మృతి చెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మక్తల్ లో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మక్తల్ మండలం గడ్డపల్లి గ్రామానికి చెందిన దీపిక మూడవ కాన్పు కోసం మంగళవారం సాయంత్రం మక్తల్ సివిల్ ఆస్పత్రిలో చేరింది. బుధవారం 11 గంటలకు మూడవ డెలివరీలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమెకు రక్తం బ్లీడింగ్ కావడంతో అస్వస్థతకు గురైంది. దాంతో సాయంత్రం కొన్ని పరీక్షలు చేశాక, రక్తం ఎక్కించడంతో పాటు ఓ ఇంజక్షన్ చేశారు. దాంతో కొద్ది సేపటికే దీపిక వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురైంది.
దాంతో భయపడిన ఆస్పత్రి సిబ్బంది ఆమెని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వారు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. అనంతరం దీపిక మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన బంధువులు ఆందోళన నిర్వహించారు. డెలివరీ అయ్యాక దీపికకు సరైన చికిత్స అందించి ఉంటే చనిపోయేది కాదని ఆరోపించారు. దీపిక మరణానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, ఈ సంఘటనపై న్యాయ విచారణ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. కాగా ముందు జాగ్రత్తగా మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి తన సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటనపై వివరణ కోరేందుకు దిశ ప్రతినిధి ప్రయత్నించగా ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో లేరు.