- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోహన్ బాబు ఇంట్లో చోరీ చేసిన నిందితుడు అరెస్ట్
దిశ, బడంగ్ పేట్ : మోహన్ బాబు ఇంట్లో రూ.10 లక్షలు దొంగతనానికి పాల్పడ్డ హౌజ్ బాయ్‌ను పహాడిషరీప్ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. నిదితుడి వద్ద నుంచి రూ.7 లక్షల 36 వేల 400లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పహాడిషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జల్పల్లిలోని మంచు టౌన్ షిప్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా సినీనటుడు మోహన్‌బాబు కుటుంబం నివసిస్తుంది. మూడేళ్ల క్రితం మోహన్ బాబు వద్ద కార్యదర్శిగా కిరణ్‌కుమార్ తేజ్ విధులు నిర్వహిస్తున్నాడు. గత ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రవంకపల్లి విలేజ్‌కు చెందిన వడితె గణేష్ నాయక్ (24) మోహన్ బాబు ఇంట్లో హౌజ్ బాయ్‌గా చేరాడు.
మొదట్లో గణేష్ నమ్మకంగానే ఉన్నాడు. కాగా ఈ నెల 22వ తేదీన తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీ నుంచి కార్యదర్శి కిరణ్‌కుమార్ తేజ్, గణేష్ నాయక్‌లు రూ.10 లక్షలను తీసుకుని జల్ పల్లి లోని మంచు టౌన్ షిప్ కు వచ్చారు. అక్కడ తన గదిలో కిరణ్‌కుమార్ డబ్బులు పెట్టి పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి చూసేసరికి అక్కడ రూ.10 లక్షలు కనిపించలేదు. వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా గణేష్ నాయక్ ఆయన గదిలోకి వచ్చి వెళ్లినట్టు కనిపించడంతో పాటు అతను పరారైనట్టు గుర్తించారు. దాంతో వెంటనే జరిగిన విషయాన్ని కార్యదర్శి కిరణ్ యజమాని మోహన్‌బాబుకు వివరించారు.
దీంతో మోహన్ బాబు సూచన మేరకు కిరణ్‌కుమార్ ఈనెల 23వ తేదీన రాత్రి 10 గంటలకు పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పహాడిషరీఫ్ పోలీసులు అప్పటి నుంచి పరారీలో ఉన్న గణేష్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 7,36,400 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులు జల్సాలకు ఉపయోగించినట్లు గణేష్ నాయక్ పోలీసుల విచారణలో నేరాణ్ని అంగీకరించాడు. గణేష్ నాయక్‌ను అరెస్ట్ చేసి బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును పహాడిషరీప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- arrested