- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగాల పేరిట సినార్జీ యూనివర్సల్ కంపెనీ భారీ మోసం
దిశ, శేరిలింగంపల్లి : ఉద్యోగాలు ఇస్తామని డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది ఓ మరో సాఫ్ట్వేర్ కంపెనీ. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ కావూరి హిల్స్ లోని వీవీ ఛాంబర్స్ నాలుగో అంతస్తులు ఉన్న సినార్జీ యూనివర్సల్ కంపెనీ ఐటీ కంపెనీలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర నుండి రూ. 3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు సినార్జీ యూనివర్సల్ కంపెనీ సుమారు 500 మంది నిరుద్యోగుల నుండి వసూళ్ల పాల్పడింది. వారిని నమ్మిన నిరుద్యోగులు డబ్బులు చెల్లించారు.
వారికి ఆఫర్ లెటర్ చేతికిచ్చి వర్క్ ఫ్రాం హోమ్ అని చెప్పి ఆరు నెలలు గడిపిన కంపెనీ యజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి జీతాలు చెల్లించలేదు. దీంతో బాధితులు కంపెనీ యజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే కంపెనీకి ప్రాజెక్టులు లేవని దాటవేస్తూ వస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కంపెనీ యజమాన్యం ఆఫీస్ కి రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న ఉద్యోగులు గురువారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినార్జీ యూనివర్సల్ కంపెనీ చేసిన మోసం కోట్లల్లో ఉండడంతో ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేయాలని మాదాపూర్ పోలీసులు బాధితులకు తెలిపారు. శుక్రవారం ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.