- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పదంగా మహిళ మృతి
దిశ, గద్వాల క్రైం : అనుమానాస్పదంగా ఓ మహిళ మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో తన భార్య మృతి చెందినట్టు మృతురాలి భర్త చెబుతుండగా మృతిరాలి కుటుంబ సభ్యులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గద్వాల మండలం పరమాల స్టేజ్ వద్ద గల బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మెరిస్సా అనే యువతి పనిచేస్తుంది. ఈ క్రమంలో రోజువారీగా గోనుపాడు గ్రామం నుంచి హాస్టల్ కు ద్విచక్ర వాహనంపై కొడుకు, భార్య మెరిస్సాతో కలిసి భర్త రామకృష్ణ బయలుదేరాడు. గద్వాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మార్గం మీదుగా వెళ్తుండగా కుక్క అడ్డం రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ వెనుక ఉన్న మెరిస్సా (35) అక్కడికక్కడే మృతి చెందింది.
కానీ ఈ ప్రమాదంపై మృతురాలి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని నిర్మాణుష్య మార్గంలో తీసుకొచ్చి కణతపై బలంగా కొట్టి హతమార్చినట్టు పేర్కొంటున్నారు. బైక్ ముందు కూర్చున్న బాబుకు, వాహనం నడుపుతున్న రామకృష్ణకు ఎలాంటి గాయాలు కాలేదని కేవలం మా కూతురు కిందపడి ఎలా మరణిస్తుందని ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారమే తన బావ హతమార్చాడని మృతురాలి తమ్ముడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతురాలి భర్త తప్పించుకొని తిరుగుతున్నాడని, ప్రమాద సమయంలో బండి పైన ఉన్న కుమారుడిని కూడా ఎక్కడో దాచి పెట్టాడని, పోలీసులు ఆ బాబుని విచారిస్తే అసలు విషయం బయట పడుతుందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనునట్లు గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ రావు తెలిపారు.