విరేచనాలతో ఆశ్రమ విద్యార్థిని మృతి

by Sridhar Babu |   ( Updated:2024-10-26 12:48:39.0  )
విరేచనాలతో ఆశ్రమ విద్యార్థిని మృతి
X

దిశ,ఇంద్రవెల్లి : ఇంద్రవెల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి (student Death)మాడావి గంగోత్రి (15) వాంతులు, విరేచనాలతో శనివారం మృతి చెందింది. తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన మడావి కృష్ణ , జంగుబాయి దంపతులకు చెందిన రెండో కూతురు గంగోత్రి (Gangotri)ఇంద్రవెల్లి ఆశ్రమ బాలికల వసతి గృహంలో 9వ తరగతి చదువుతుంది. దసరా సెలవులు ముగించడంతో తిరిగి ఈనెల 21న సోమవారం పాఠశాలకు వచ్చింది. పాఠశాలకు వచ్చిన గంగోత్రికి రెండు రోజుల నుంచి నెలసరి రావడంతో స్వల్ప అస్వస్థత (Illness)కు గురైంది. శనివారం తెల్లవారుజామున వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది మండల కేంద్రంలోని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు ఆక్సిజన్ లెవాల్స్ తగ్గాయని గుర్తించి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అంబులెన్స్​లో తరలిస్తుంగా మార్గమధ్యలో మృతి చెందింది. కాగా వసతి గృహ సిబ్బంది తమ కూతురు అనారోగ్యంగా ఉన్నా పట్టించుకోలేదని, ఏఎన్ఎం విజయ, వార్డెన్ ప్రకాష్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందిందని, కుటుంబ సభ్యులతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు మృతదేహం ఉన్న అంబులెన్సును అడ్డుకొని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఉట్నూర్ సీఐ మొగిలి ఎస్సై సునీల్ చొరవతో కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం కుటుంబీకులకు ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Next Story

Most Viewed