- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొద్దుపొద్దున్నే రెచ్చిపోయిన స్నాచర్లు
by Mahesh |
X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: తెల్లవారుజామున 4 గంటలకే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. టిఫిన్ చేయడానికి స్నేహితుడితో కలిసి వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని ఉడాయించారు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మాదన్నపేట్ నివాసి సాయి ప్రసాద్ ఉప్పల్‌లోని జెన్పాక్ట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి స్నేహితుడు పవన్ తో కలిసి చైతన్యపురి చౌరస్తాకు వచ్చాడు. చౌరస్తా వద్ద రోడ్డు దాటడానికి నిలబడి ఉండగా నెంబర్ ప్లేట్ లేని నలుపు రంగు యాక్టివాపై వచ్చిన ఇద్దరు అగంతకులు సాయి ప్రసాద్ మెడలోని బంగారు గొలుసు తెంచుకుని ఎల్బీనగర్ వైపు ఉడాయించారు. ఈ మేరకు సాయి ప్రసాద్ ఫిర్యాదు చేయగా చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story