- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన ఊరు మనబడి నిధులు రాలేవని ఎస్ఎంసి చైర్మన్ ఆత్మహత్య..!
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ సురంగల విజయ్ (33) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి ప్రోగ్రాం లో పాఠశాలలో అభివృద్ధి, మరమ్మత్తుల పనులు చేపట్టి నిధులు రాకపోవడంతోనే బాధతోనే విజయ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కల్లడిలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి పథకంలో 5 లక్షల 80 వేల తో ఆత్మహత్య చేసుకున్న విజయ్ పనులు చేపట్టాడు.
వీటి నుంచి 4 లక్షల నిధులు రాగ, మిగతా డబ్బులు మంజూరు కాకపోవడంతో బాధతోనే విజయ్ ఆయన ఇంట్లోనే ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషయమై మాక్లూర్ పి ఆర్ ఏ ఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. కల్లడి ప్రాథమిక పాఠశాలలో సురంగల విజయ్ మన ఊరు మనబడిలో 5 లక్షల 80 వేలతో పనులు చేయగా నాలుగు లక్షల నిధులు అతనికి మంజూరయ్యాయని, మరో 1.80 వేల కోసం ఎంబి రికార్డు చేసి నిధుల మంజూరుకు పంపమన్నారు. ఇంకా అతనికి 1.80 వేల మన ఊరు మనబడి నిధులు రావాల్సి ఉందన్నారు.