కీళ్ల నొప్పులని నిద్ర మాత్రలు వేసుకుంది…

by Kalyani |
కీళ్ల నొప్పులని నిద్ర మాత్రలు వేసుకుంది…
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : కీళ్ల నొప్పులు భరించలేక నిద్రించేందుకు రోజులాగే నిద్ర మాత్రలు వేసుకుంది. వేసుకున్న కాసేపటికే నిద్రలోనే ఓ వివాహిత కన్ను మూసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓడిఎఫ్ కాలనీకి చెందిన కట్ట కృష్ణ హోంగార్డ్ గా పని చేస్తున్నాడు. అతడి భార్య కట్ట ఎల్లమ్మ (45) ఈ నెల 4న కీళ్ల నొప్పులు విపరీతంగా ఉండటంతో నిద్ర మాత్రలు వేసుకుంది. కాసేపటికి అతని భర్త కృష్ణ ఆమెని నిద్ర నుంచి లేపేందుకు ప్రయత్నించాడు. ఎంతకీ ఆమె లేవకపోవడంతో స్థానిక ఓడిఎఫ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. నిద్ర మాత్రలు ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఎల్లమ్మ మృతి చెందినదా లేదా ఇంకా ఏదైనా కారణాల వల్ల మృతి చెందిందా అనేది పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తెలుస్తోందని ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.

Advertisement

Next Story

Most Viewed