ఏడుగురు మావోయిస్టులు అరెస్ట్

by Sridhar Babu |
ఏడుగురు మావోయిస్టులు అరెస్ట్
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ రాష్ట్రం జాగర్గుండ పోలీస్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు ఏడుగురు మావోయిస్టులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు గస్తీ కాస్తున్న సమయంలో కొంత మంది అనుమానాస్పద వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.

వారిని విచారించడంతో మావోయిస్టు పార్టీకి చెందిన వారమని ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి ఐఈడీ బాంబుకు సంబంధించిన సామగ్రి తో పాటు రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. మడకం కోస, కుంజం జగ్గు, మడివి జోగా, దోడి మోతు, మడివి లక్ము, హితేష్, సురేష్ గా గుర్తించారు. వీరంతా భద్రతా బలగాలను మట్టుపెట్టటానికి మందు పాతర అమర్చేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed