విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్

by Satheesh |   ( Updated:2023-02-10 04:03:16.0  )
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని వెంకోజిపాలెంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ట్రాలీ ఆటో డ్రైవర్ ఘటన స్థలం నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న ట్రాలీ ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story