- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 కేజీల గంజాయి పట్టివేత
దిశ,టేకులపల్లి : ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రోల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కారులో 8 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఎన్ఫోర్మెంట్ టీం సీఐ సుంకర రమేష్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా గుడుంబా, గంజాయి, మాదకద్రవ్యాలు అమ్మడం, రవాణా జరుగుతుందన్న నేపథ్యంలో బుధవారం ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం రోళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న కారును తనిఖీ చేయగా అందులో 8 కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
కారులో ప్రయాణిస్తున్న నలిమల వినోద్ పారిపోయాడని, మరొక వ్యక్తి బానోత్ గణేష్ సిద్దిపేటకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అతని వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకొని వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఇల్లందు సీఐ బి. రాంప్రసాద్, ఎస్సై అచ్చారావు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కరీం, బాలు, హెడ్ కానిస్టేబుల్ రవిబాబు, సుధీర్, వెంకట్, హరీష్, హనుమంతరావు సిబ్బంది పాల్గొన్నారు.